విశ్వంవాయిస్ న్యూస్, అమరావతి:
: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా వున్న 957 స్టాఫ్ సర్స్లో పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా, ఏ ఒక్క పోస్టూ ఖాళీగా వుండరాదని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాలుగు జోన్ల వారీగా ఏడాది కాలపరిమితికి కాంట్రాక్ట్ విధానంలో ఈ
పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ను http://chw.ap.nic.in వెబ్సైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. వెబ్ సైట్లో ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకూ ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో వుంటుందన్నారు. భర్తీ చేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో (1. రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, బులైయ్య కాలేజ్ ఎదురుగా, రేసపువాని పాలెం, విశాఖపట్నం, 2. రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జిల్లా ప్రధాన ఆస్పత్రి ఆవరణలో రాజమహేంద్రవరం, 3. రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్వినీ ఆస్పత్రి వెసుక, పాత ఇటుకలబట్టీరోడ్, గుంటూరు, 4. రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, పాత రిమ్స్, కడప) ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి. వుంటుంది. జిఎన్ఎం(జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ)/ బిఎస్సీ (నర్సింగ్) కోర్సులు పూర్తి చేసి 42 ఏళ్లలోపు వయస్సున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు. మాజీ సైనికులకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయో పరిమితిని సడలించారు. ఓసి అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రు.500, ఎస్సీ, ఎస్టీ, బిసి, దివ్యాంగులకు రు.300గా నిర్ణయించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక. వుంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రూపొందించే మెరిట్ లిస్ట్లు వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరులకు ఏ మాత్రం కొరత లేకుండా వుండేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత మూడున్నరేళ్ల కాలంలో వైద్య ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా 957 స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు
పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఎపి వైద్య విధాన పరిషత్ కమీషనరేట్ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
జోన్లవారీగా ఖాళీల వివరాలు
జోన్ -1. 163
జోన్ – 2. 264
జాన్ – 3 239
జోన్ – 4. 291
మొత్తంఖాళీల సంఖ్య 957..