విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
దేవరపల్లి,(విశ్వం వాయిస్ ప్రతినిధి): స్వచ్ఛంద సంస్థల సేవలు దేశానికి నిరంతరం అవసరమని సమాజం కోసం సేవలందించే పార్ద్ ఇండియా వేదికలో సమాజ హితం కోరే ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం పొందాలని పార్డ్ ఇండియా గౌరవ అద్యక్షులు కారుమంచి గణేష్ పిలుపునిచ్చారు.పార్డ్ ఇండియా స్వచ్ఛంధ సంస్థ ప్రధాన కార్యాలయం 2011 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం నందు ఏర్పాటు చెయ్యడం జరిగిందని,రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ శాఖలను విస్తరింపజేయడం ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,బడి తరువాత విద్యాపథకం,నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించటం,ఫీడ్ టు హంగ్రీ, పర్యావరణ పరిరక్షణ,వ్యక్తిత్వ వికాసం,ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలు,సహాయం అందించటం వంటి పలు సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని,సంస్థకు దాతలు అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కలదని గణేష్ తెలిపారు.