ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు.
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మానవుడికి మానసిక ఒత్తిడికి క్రీడలు ఎంతో అవసరమని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలోని మంగళవారం శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్నఏపి సీఎం కప్ ప్రైజ్ మనీ టోర్నమెంట్-2022 డిస్ట్రిక్ట్ లెవెల్ మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో వాలీబాల్ అండ్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీలు ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, పాల్గొనడం మన ప్రతిభాగా భావించాలన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాల నిర్వహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వారిలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంద న్నారు.క్రీడల ద్వారా విద్యార్థులలో మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. హాకీలో ధ్యాన్‌చంద్, క్రికెట్లో సచిన్, పరుగులో మిల్కా సింగ్, కరణం మల్లీశ్వరిలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ లు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు, గోరుముద్ద వంటి పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. జగనన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా విద్యార్థులు బాగా చదువుకుని క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని.. అందుకు వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే గాక వ్యక్తిత్వాన్ని పెంపోందిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు విద్యార్థుల వలె ఆటలు ఆడి క్రీడలను ప్రారంభించి పోటీలలో పాల్గొన్న విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఎమ్మెల్యే వేగుళ్ళ, జడ్పిటిసి మంగతాయారు, ఎంపీపీ నౌడు వెంకటరమణ తదితరులు జిల్లాస్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొని విన్నరగా, రన్నర్ గా నిలిచిన జట్లకు డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి , జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి , గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ , వెలగల ఫణి కృష్ణారెడ్డి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. కబడ్డీ అమ్మాయిలు జట్టు విన్నర్ గా కొత్తపేట నియోజకవర్గం , రన్నర్ గా అమలాపురం నియోజకవర్గం, కబడ్డీ అబ్బాయిల జట్టు విన్నర్ గా ముమ్మిడివరం నియోజకవర్గం రన్నర్ గా రామచంద్రపురం నియోజకవర్గ వాలీబాల్ ఉమెన్స్ జట్టు విన్నర్ గా పి గన్నవరం నియోజకవర్గం రన్నర్ గా అమలాపురం నియోజకవర్గం వాలీబాల్ మెన్స్ జట్టు విన్నర్ గా పి గన్నవరం నియోజకవర్గం రన్నర్ గా మండపేట నియోజకవర్గం ఏపీ సీఎం స్పోర్ట్స్ పోటీలలో భాగంగా ఈ ట్రోఫీలను గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సభాధ్యక్షులుగా పి ఎస్ సురేష్ కుమార్(సాప్ డిస్టిక్ కోచ్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్), పాఠశాల పిడి నల్లమిల్లి అప్పారెడ్డి( కోనసీమ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు) సాప్ డైరెక్టర్ అలేఖ్య లాజరస్, మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, రాయవరం గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ , పాఠశాల పి ఎం సి చైర్మన్ నరేంద్రరెడ్డి , పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తేతలి సుబ్బరామి రెడ్డి ,పడాల కమలారెడ్డి, టెంటు సత్యనారాయణ , వెలగల ఫణికృష్ణారెడ్డి, రీమ్మలపూడి సుబ్బారావు, కొల్లి సత్యనారాయణ, వల్లూరి శ్రీనుచౌదరి, మల్లెపాల గోవింద్, బక్కి సందీప్,నేతల సురేష్, చల్లా సత్యనారాయణ లు పాల్గొన్నారు.