WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వైసిపి పాలనలో దళితులకు తీరని అన్యాయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

 

కొత్తపేట, విశ్వం వాయిస్ : వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, పార్లమెంట్ ఇన్చార్జి హరీష్ మాధుర్ హాజరయ్యారు. టిడిపి ఎస్సీ సెల్ నాయకుడు నల్లా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బండారు సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దళితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని, వాటిని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇటీవల గోపాలపురంలో అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ప్రశ్నించిన దళితులపై కేసులు బనాయించడం దారుణమన్నారు. అంతేకాక దళితులను చంపి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాటి దళితులకు అన్యాయం జరుగుతున్న వైసీపీలో ఉండే వారు ప్రశ్నించకుండా ఉండిపోవడం అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమని సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితుల కోసం అనేక పథకాలు ఉండేవని, ఇప్పుడు వాటన్నిటిని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చడం దారుణమన్నారు. అనంతరం అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి హరీష్ మాధుర్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా గద్దెనెక్కిన తర్వాత దళితుల బ్రతుకులు అయోమయంగా మారాయన్నారు. దళితుల అండతో అందలమెక్కి దళితులపైనే వైసిపి ప్రభుత్వం దాడులు చేస్తోందని వాపోయారు. అలాగే దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లా వెంకటరమణ, బీర ఇస్సాకు, పల్లి భీమారావు, బూసి జయలక్ష్మి, చిత్రపు ఆనందబాబు, మాకే నాగభూషణం, బూసి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement