విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
పనులు నాణ్యతతో చేపట్టి ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో మంగళవారం దళితవాడలో సుమారు 8.70 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న సిసి డ్రైన్ పనులను ఎమ్మెల్సీ తోట పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ వెంట జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురం శ్రీనివాస్, ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను, వార్డ్ మెంబర్ మందపల్లి మనమ్మ కొండలరావు, ఏఎంసి డైరెక్టర్ తేతలి సుబ్బరామిరెడ్డి, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మంతెన అచ్యుతరామరాజు, సచివాలయ ఇంజనీరు సునీత, కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.