– గోదావరి నదిని కలుషితం చేస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
గోదావరి నదిని కలుషితం చేస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని డివిజన్లలో పాదయాత్ర చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్నాని అను యాదవ్ వెల్లడించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న నవరత్న పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పథకాలు అందని వారికి అందించేలా భరోసా కల్పించేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. స్థానిక కోటగుమ్మం శివుడి విగ్రహం వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు గోదావరి కాలుష్యంపై బీసీ మహిళల్లో చైతన్యం తేవడానికి ఈ యాత్ర చేపడుతున్నానని వివరించారు.బీసీలకు జగన్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్ని రంగాల్లో వారు ముందడుగు వేసేలా సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జగన్ బీసీ అభ్యున్నతికి మరిన్ని పథకాలు అమలు చేయాలని ఆకాంక్షించారు.ఇదే సమయంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యత్వాలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చూడతామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా త్వరలో 5 వేల మంది మహిళలతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ను వైఎస్ఆర్సిపి గెలుచుకునేందుకు అవసరమైన విధంగా పార్టీకి తన వంతుగా ఈ పాదయాత్ర ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నగరంలో బీసీలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 7893596296 తన నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.