విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*అధిష్టానం ఆదేశానుసారం జోరుగా సాగుతున్న ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం*
*అమలాపురం పట్టణంలో ఇదేం కర్మ వ్యాపారస్తులకు అంటూ ముందుకు సాగింది*
అమలాపురం డిసెంబర్ 28 విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురంలో ఇదేం ఖర్మ వ్యాపారస్తులకు…
పన్నులతో రాష్ట్రంలో వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందని మెట్ల రమణ బాబు, అయితాబత్తుల ఆనందరావులు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు కంకటాల రాంబాబు అధ్యక్షతన, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కర్రీ రామస్వామి(దత్తుడు), వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనం సత్య నాగేశ్వరరావు(బాబు), వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ, ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో బంగారు దుకాణలు వీధిలో రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం మాజీ ఎమ్మెల్యే , అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . నాయకులు వ్యాపార దుకాణలు, వ్యాపారస్థులు వద్దకు వెళ్లి ఇదేం ఖర్మ వ్యాపారస్తులకు కరపత్రాలు పంచుతూ జగన్ ప్రభుత్వం జే టాక్స్ తో దొచేస్తున్నాడని. పెరిగిన కరెంట్ చార్జీలు పెంపు, అద్దెలు పెంపు, పేరు బోర్డు పై పన్ను ఇలా అనేక పన్నులు భారంతో చిన్న వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారుల వరకు అందరి నడ్డి విరుస్తున్నాడని.రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వస్తేనే రాష్ట్రంలో అన్ని గాడిలో పడతాయని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పట్టణం అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి నల్లా స్వామి,జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి,రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యనిర్వాహక కార్యదర్శి బొర్రా వెంకటేశ్వరరావు, భాస్కర్ల రామకృష్ణ, వలవల శివరావు, శెట్టిబత్తుల దిన్సా బాబు, ఆవుపాటి వేణుగోపాల్, నర్గాన శ్రీనివాస్, పట్టణం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికాశంఖ్యలో పాల్గొన్నారు