ఒక ఓటరు ఒక గంట ఓటు వేస్తే ఆ నాయకుడు వారికి ఐదు సంవత్సరాలు సేవలు అందించాలి..
ఈ నియోజకవర్గంలో డబ్బు కట్టలతో గెలిచినా ఎమ్మెల్యే వేగుళ్ళ ఏమి అభివృద్ధి చేశారు అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ తోట…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా పేద ప్రజలకు మండల అందిస్తున్న పింఛను కానుక పధకం లబ్ది సొమ్ములను 2023 కొత్త సంవత్సరం నుంచి సచివాలయాల సమన్వయకర్తల సమక్షంలో వాలంటీర్లు సక్రమంగా పంపిణీ చేయాలని మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపును ఇచ్చారు. మండలంలో పసలపూడి గ్రామంలో చింతా పాండురంగ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఎం పి పి నౌడు వెంకటరమణ అధ్యక్షతన మండల సచివాలయాల వాలంటీర్లు, సచివాలయాల పార్టీ కన్వీనర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యాదితులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్సీ తోట మాట్లాడతూ ఇకపై ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలకు పింఛన్ల పంపిణీలో ఆ ప్రాంతంలోని సచివాలయాల ముగ్గురు సమన్వయకర్తలను, అలాగే పార్టీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భాగస్వామ్యం చేయాలన్నారు. వారి సమక్షంలోనే, వారి చేతుల మీదుగానే వాలంటీర్లు అందరూ లబ్దిని పంపిణీ చేయాలని, అందుకు సచివాలయాల సమన్వయకర్తలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా సహకరించాలని కోరారు. పింఛను పంపిణీ సందర్భంగా ఇప్పటికే ప్రభుత్వ సరఫరా చేసిన జగనన్న సందేశ లేఖా పత్రాన్ని లబ్దిదారులకు చదివి వినిపించి, దానిని వివరించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశించారు. అలాగే ఈ ప్రభుత్వ పధకాలు అన్నింటిని ఆయా సచివాలయాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు బాగా ప్రచారం చేయాలని ఎమ్మెల్సీ కోరారు. ప్రభుత్వ పధకాలను ప్రజలకు అందించేందుకు ఒక్కో సచివాలయానికి ముగ్గురు చొప్పన సమన్వయకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నియమించిందని ఎమ్మెల్సీ తోట వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అనుకోని రీతిలో ఏదైనా పొరపాటు జరిగి ప్రభుత్వం గనుక మారితే ఆ కొత్త ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోతాయని, తద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలే నష్టపోతారనీ ఆయన వివరించారు. జగన్ మోహన్ రెడ్డి, అతని సంక్షేమ పథకాలకు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి పేద ప్రజల కోసం, ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల కోసం మళ్ళీ ఆయన ప్రభుత్వమే రావాలన్నారు. అందుకోసమే, పేదప్రజల అభివృద్ధి కోసమే సచివాలయాల సమన్వయకర్తల వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరిపాలన జరుగుతుందని, ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగింది అని చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని ఎమ్మెల్సీ అన్నారు. గ్రామాలలో వెంటనే వాలంటరీలు సచివాలయ పార్టీ కన్వీనర్లు మూడు విభాగాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్రామాలలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పెంచిన పింఛన్ 2500 నుండి మరో 250 పెంచిన పెంచనను సచివాలయ కన్వీనర్ల వాలంటీర్ల సమన్యాయంతో లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఒక ఓటరు ఒక గంట ఓటు వేస్తే ఆ నాయకుడు వారికి ఐదు సంవత్సరాలు సేవలు చేయాలని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇండ్ల స్థలం ఇవ్వాలంటే కేవలం ప్రభుత్వ స్థలాలను చూసి దేవాలయం భూములను ఇచ్చేవారని కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు వద్ద సుమారు 31 లక్షల మంది పేదలకు 25 వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులతో ఏర్పాటు చేసిన ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుంది అన్నారు. గ్రామాలలో వాలంటీర్లుగా పనిచేస్తున్న ప్రతి వాలంటరీ కూడా ఒక కార్యకర్త అని తోట తెలియజేశారు. గ్రామ వాలంటీర్లకు గౌరవం తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని 1,50,000 కోట్ల రూపాయలతో ప్రతి పేదవాడికి వాలంటరీ చేతుల మీదుగా ఆయా సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ఆ గ్రామాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు గౌరవం దక్కిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా పేద ప్రజలకు అన్యాయం చేసి నందుకు ప్రజలు 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేవలం 23 సీట్లు మాత్రమే మిగిల్చారని అన్నారు. నేను పని చేశాను అనడం కన్నా మేము పనిచేశామని చెప్పుకోవడంలోనే అభివృద్ధి కనబడుతుందని అన్నారు. ఈ నియోజకవర్గంలో 2019లో 10, 500 ఓట్లు మెజారిటీతో గెలిచిన టిడిపి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఏమి చేసిందని ఎమ్మెల్సీ తోట ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావు తన డబ్బు కట్టలను భుజాన వేసుకుని గెలిచిన ఎమ్మెల్యేగా పేరు ఉందని అన్నారు. అనంతరం రాయవరం, వెంటూరు, చెల్లూరు, సోమేశ్వరం గ్రామ వాలంటీర్లు ఈ ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తమ చేతుల మీదుగా పేద ప్రజలకు అందించడంలో మాకు తగిన గౌరవం దక్కిందని అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి యువ నాయకుడు తోట పృధ్విరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి పాపారాయుడు, ప్రభుత్వ విప్ కర్రి విజేత, సత్తి వెంకటరెడ్డి, చింతా సుబ్బారెడ్డి, చింతా వెంకటరెడ్డి(బాబులు) చింతా రామ్మోహన్ రెడ్డి, మండల సర్పంచుల అధ్యక్షులు షేక్ ఆరిఫ్ , పసలపూడి గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి , వైయస్సార్సీపి జిల్లా ప్రసార కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాసు, రాయవరం మండలంలోని ఆయా గ్రామాల గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు , ఎంపీటీసీలు , వార్డు మెంబర్లు ,గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు ,నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.