విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్ర మాదిగ జేఏసీ మహాసభ డిమాండ్ చేసింది.గురువారం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ లోని చర్చిలో మాదిగ జేఏసీ రెల్లి ఉప కులాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పానుగోటి కృపాకర్ మాదిగ, రాష్ట్ర మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు ముప్పిడి దైవ వరప్రసాద్ మాదిగ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఉన్న మాదిగ, రెల్లి, వాటి ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు హేతుబద్ధంగా లేకపోవడం వల్లనే ఈ అసమానతలు చోటు చేసుకున్న అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అఖిలపక్షాన్ని పంపించారని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని వివరించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. మాదిగ రెల్లి ఉపకులాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర మాదిగ జేఏసీ మహాసభ ఉద్యమిస్తుందని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలని అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వర ప్రసాద్ మాట్లాడుతూ
జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ అందరికీ సమానంగా జరగాలని,మాదిగలకు ఉపకులాల వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్యార వారికి సబ్సిడీ కూడిన లోన్ లు ఈ ప్రభుత్వ అందించాలి వారికి ఆర్దికంగా సహాయపడాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కళ్యాణం కోటేశ్వరరావు,వల్లూరి నాని, వెంకటరావు నిడిగట్ల,ప్రముఖ న్యాయవాది చింతపర్తి రాంబాబు,మహిళ నాయకురాలు కావూరి వరలక్ష్మి,సురేష్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు తుత్తరపూడి రమణ మాదిగ, దొండపాటి కృస్టాఫర్,రాచర్ల మురళి, కొమ్ము సత్తిబాబు,పల్లేటి శ్రీను,తదితర నాయకులు పాల్గొన్నారు.