విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
పేద ప్రజల సంక్షేమం ఆర్దికాభివృద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ఢి ధ్యేయమని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలంలోని వెంటూరు గ్రామ సచివాలయం 2 పరిధిలోని శుక్రవారం మధ్యాహ్నం బుట్టాయిపేట, చొల్లంగి పేట లోగడపగడపకి మన ప్రభుత్వం గ్రామ శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుట్టాయిపేట లో ని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు అనంతరం బుట్టాయిపేటలో గడపగడపకు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుని జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ త్రిమూర్తులు గ్రామ మహిళలు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయడాలలో కేవలం పేదరికానే అర్హతగా తీసుకోవడం జరిగింది అన్నారు.గత ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలంటే ప్రతి సంక్షేమ పథకాలలో కమిషన్లు ఆ పార్టి కార్యకర్తలు తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్సీ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శనీయమన్నారు. గతంలో ఏ పని కావాలన్నా మండల పరిషత్ ఇతర కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగవలసి వచ్చేదని ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి అన్ని పనులు చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని తెలిపారు. వచ్చేఎన్నికలలో ప్రజలు జగన్ కి ఓటు వేసి రుణం తీసుకోవాలని తోట విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, ఉపసర్పంచ్ నున్న ప్రదీప్ కుమార్,వైస్ ఎంపీపీ గుబ్బల సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ వాసంశెట్టి విజయకుమార్, జడ్పిటిసి నల్లమిల్లి మంగుతాయారు వెంకటరెడ్డి, రాయవరం మండలం వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్ అధ్యక్షులు చిన్నం అపర్ణ పుల్లేష్, రాయవరం మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు షేక్ ఆరిఫ్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాస్ రావు,రాయవరం మండలంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ,గ్రామ సచివాలయ పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ఎంపీడీవో డి శ్రీనివాస్, తహసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ చైతన్య కుమారి, పంచాయతీరాజ్ డిఇ వి రామనారాయణ, వ్యవసాయ అధికారి కే ప్రభాకర్, ఆయా గ్రామాల నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ శ్రేణులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు