విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
గతంలో ఆర్ధిక కష్టాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఆరోగ్య కష్టాలు, కరోనా మహమ్మారి చాలా మంది కళాకారుల్ని తీసుకువెళ్లింది. జీవితమంతా నాటకాన్ని బ్రతికించినవారు బ్రతకలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు నటించడానికే పుట్టారు, మరణించారు. మోతుగూడెం చిన్న ఊరే అయినా నాటకాలకు కొదవలేదు.సమాజంలో ప్రతిబింబించే మనుష్యుల జీవితం అడుగడుగునా మనకు ఎదురు పడే సామాజిక సమస్యలను రంగస్థలంపై ఎ.పి.జెన్. కో లోయర్ సీలేరు కాంప్లెక్స్ అధికారులు,ఉద్యోగులు కలిసి బుధవారం రాత్రి మోతుగూడెం ఎ.పి.జెన్. కో విద్యుత్ కళాభారతి నందు ఆలోచింపచేసే* ఐదవగది*అను సాంఘిక నాటకం ప్రదర్శించారు. మానవునికి మనసులో ద్వేషం, అసూయ, పగ, ధనం లాంటి గదులు వున్నాయి, ఇవి చెడ్డవి, ప్రతి మనిషి ప్రేమ, త్యాగం, సహాయం వంటి కలయికతో ఐదవగదిని ఏర్పరుచుకోవాలని సమాజాన్ని పునరాలోచనలో పడేసే చక్కని నాటక ప్రదర్శన చేసారు. కానీ ఎవరికి వారు వంద నాటకాలు వేస్తున్న రోజుల్లో సమాజాన్ని మేల్కొలిపే ఇలాంటి ఈ నాటక ప్రదర్శనకు తెరవెనుక డి.ఇ.బాలకృష్ణ దర్శకత్వం వహించగా, నిర్వహణ సివిల్: ఇ.ఇ.బాబూరావు ఆధ్వర్యంలో..సంగీతం: రాజశేఖర్, సెట్టింగ్: కొట్టు శ్రీను తదితరులు అందించారు. ఈ ప్రదర్శనకు విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు :వి.యస్.క్రిష్ణేశ్వరరావుకి ఎ.పి.జెన్. కో ఛీఫ్ ఇంజనీర్ శ్రీధర్ చేతులు మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నాటికలో అప్పర్ సీలేరు: డి.ఇ.లక్ష్మీనారాయణ,మోతుగూడెం, పొల్లూరు యువత, మహిళలు, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ నాటికలో కళాకారులు అద్భుతంగా నటించారు. ఇలాంటి నాటక ప్రదర్శనలతో పాటు, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అందించాలని విచ్చేసిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు…