విశ్వంవాయిస్ న్యూస్, జగ్గంపేట:
జగ్గంపేట హెచ్ పి పెట్రోల్ ప్రక్కన గల పెద్ద కాలువలో చెత్తాచెదారంతో నిండిపోయి విపరీతమైన వాసన వస్తుంది.దీనివలన అనేకమైనటువంటి అంటూ వ్యాధులు రావటానికి పుష్కలంగా ఇదే నిదర్శనం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆ కాలువలో చుట్టుప్రక్కల వాళ్ళందరూ చెత్తాచెదారంతో నింపుతున్నటువంటి పరిస్థితి సరిగ్గా నడుచుకుంటూ అక్కడికి వచ్చేసరికి ముక్కు మూసుకుని వెళ్లవలసిన పరిస్థితి జగ్గంపేట మేజర్ పంచాయతీ అయినా ఇటువంటి దుర్గంధంతో నిండి ఉందని వాసన భరించలేకపోతున్నామని ఇక్కడకు వచ్చిన ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దీనిపై దృష్టిఉంచి సంవత్సరానికి ఒక్కసారైనా ఆ కాలును క్లీన్ చేస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. కనీసం బ్లీచింగ్ అయిన నెలకు ఒకసారి జల్లినట్లయితే ఆ వాసం నుండి తప్పించుకోవచ్చని వారి అభిప్రాయం ఎప్పటినుండో ఈ దుర్గంధం ఇలా వస్తున్నా ఏ అధికారి కానీ నాయకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి మేజర్ పంచాయతీ అయిన జగ్గంపేటలో నిండు ఉంది ఒక్కసారి అధికారులు ఆ కాలును పరిశీలించినట్లయితే వాస్తవాలు వాళ్లకే తెలుస్తాయని ప్రజలు వాపోతున్నారు.