విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవు సి హెచ్ సి లో రక్తదాన శిబిరం
తాళ్లరేవులోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన సిహెచ్సి లో ఈనెల ఆరవ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కొరకు అవసరమయ్యే రక్తాన్ని సేకరించడానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరం నెల ఆరవ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు ఆసుపత్రి చైర్మన్ విలకుర్తి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి కమిటీ సభ్యుడు అద్దంకి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని రోగుల కొరకు సేకరించే రక్తదాన శిబిరంలో పాల్గొనాలని, మరి కొంతమంది ప్రజానీకాన్ని ప్రోత్సహించాలని ఆసుపత్రి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి సభ్యులు పాల్గొన్నారు.