హుటాహుటిన సేవలందించిన సూర్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవు లో రోడ్డు ప్రమాదం
సకాలంలో వైద్య సేవలు అందించిన తాళ్ళరేవు సూర్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
తాళ్లరేవులో జాతీయ రహదారి216 సమీపంలో టీ టైం దుకాణం వద్ద బైకు అదుపుతప్పి పడిపోయి ఉన్నటువంటి కాకినాడ రమణయ్యపేటకు చెందిన గుంటముక్కల త్రిమూర్తులు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ సమయంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన సూర్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు స్పందించి క్షతగాత్రునికి సకాలంలో వైద్య సేవలు అందించారు. అనంతరం 108 లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న సూర్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత మచ్చ గంగాధర్ రావు (ఎంజీఆర్) హుటాహుటిన సంఘటన స్థలానికి సిబ్బందితో పాటు చేరుకున్నారు రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుని స్ట్రక్చర్ పై ఆసుపత్రిలోనికి తరలించి ప్రధమ చికిత్స. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారస్క స్థితికి వెళ్ళాడని, ప్రధమ చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి వైద్యులు ఎం సురేష్ ధర్మేంద్ర తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించిన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని, వైద్య సిబ్బందిని, ఆసుపత్రి యాజమాన్యాన్ని స్థానిక ప్రజలు నాయకులు అభినందించారు.