విశ్వంవాయిస్ న్యూస్, ఉప్పలగుప్తం మండలం:
*వేదాంత కార్మికుడి (మృతుడు) కుటుంబానికి 21 లక్షల నష్టపరిహారం *
– అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరిగిన ఆందోళన
– భార్యకు ఉద్యోగం పిల్లల చదువులు భరిస్తామని వేదాంత కంపెనీ హామీ
ఉప్పలగుప్తం మండలం విశ్వం వాయిస్ న్యూస్
ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం వేదాంత యాజమాన్య వేధింపుల వలన మృతి చెందిన కార్మికుడు పెట్ట రామకృష్ణ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రజాసంఘాల చేస్తున్న ఆందోళన శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరిగింది మధ్యాహ్నం ఒంటిగంట నుండి న్యాయం కోసం చేస్తున్న ఆందోళనకు వేదాంత యాజమాన్యం ఎంతకీ స్పందించకపోవడంతో యాజమాన్యం వైఖరికి నిరసనగా రామకృష్ణ మృతదేహాన్ని రవ్వ ప్లాంట్ లోపలకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులకు ఆందోళనకారులకు తోపులాట జరిగింది వేదంతో యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించడంతో చివరకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకొని వేదాంత యాజమాన్యంతో మాట్లాడటంతో వేదాంత అధికారులు దిగివచ్చి ఉప్పలగుప్తం మండలం తహసీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి ద్వారా మృతుడు కుటుంబానికి వేదాంత యాజమాన్యం తరఫున 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో 6 లక్షల రూపాయలు రామకృష్ణ భార్యకు వేదాంత కంపెనీలో ఉద్యోగం ఇచ్చి వారి పిల్లలకు ఉన్నత చదువులు వరకు ఉచితంగా విద్యను అందిస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మరొక ప్రధాన డిమాండ్ అయిన మృతుడు రామకృష్ణ లాగా గతంలో తొలగించిన ఐదుగురు కార్మికులను తక్షణ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయగా 10 రోజులలో తొలగించిన కార్మికులను తిరిగి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ చరవాణి లో ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి వేదాంత యాజమాన్యం ఇచ్చిన హామీలు సకాలంలో అమలు చేయకపోతే గ్రామ ప్రజలు ప్రజాసంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్లాంట్ కార్యకలాపాల అడ్డుకుంటామని హెచ్చరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం రూరల్ సీఐ వీరబాబు ఉప్పలగుప్తం మండల ఎస్సై వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు అనంతరం మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు
ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు
పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు జనసేన నాయకులు శెట్టిబత్తుల రాజబాబు వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ గ్రామ పెద్దలు జోగి రాజా ఎంపీటీసీ సభ్యులు పెట్ట అప్పారావు ఉప సర్పంచ్ మురళీకృష్ణ మాజీ సర్పంచ్ లు లంకె భీమరాజు పినిశెట్టి నరసింహారావు మాజీ మండల అధ్యక్షులు జోగి అర్జునరావు పలచోళ్ళ బుజ్జి లంకె శ్రీను అయితాబత్తుల అజయ్ ముత్త బత్తుల శ్రీను గెద్దాడ బుద్ధరాజ్ పాము సత్యనారాయణ అయితాబత్తుల సూరిబాబు పాలమూరు కాటయ్య నూకపెయ్యి జాన్ బడుగు అబ్బులు దార ప్రసన్న జొన్నాడ మహాలక్ష్మి రేవు రవికుమార్ ముత్తబత్తుల సురేష్ మట్ట నాగరాజు రేవు రాజేష్ బడుగు వినయ్ మరియు మృతుడి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు