విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్*
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన
జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా
అమలాపురం విశ్వం వాయిస్ మార్చి 11:
రాబోయే వేసవి దృష్ట్యా కోనసీమ ప్రజానీకానికి సురక్షితమైన త్రాగునీటిని అందించడంతోపాటు త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు వేసవి కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని చింతాడగరువు గ్రామంలో పర్యటించి వేసవి కార్యాచరణ ప్రణాళికల అమలు, ఓవర్ హెడ్ ట్యాంకుల పరిశుభ్రత లో భాగంగా ఆయన గ్రామాలలో సురక్షిత త్రాగునీటి పథకాలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని సిపిడ బ్ల్యూఎస్ తదితర తాగునీటి సరఫరా పథకాలు స్థితిగతులను ముందుగానే పరిశీలించి వేసవిలో ఎటువంటి త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నo కాకుండా ముందస్తుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకోవడం, పైప్ లైన్ స్థితిగతులను అంచనా వేసి అవసరమైతే రిపేర్లు చేయించు కోవడం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేటట్లు జనరేటర్ ఏర్పాట నుండి ప్రత్యామ్నాయ చర్యలు, చిట్ట చివరి గ్రామాలకు ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేపట్టడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను పక్షం రోజులకు ఒకసారి పరిశుభ్రం చేయాలని అదేవిధంగా జిల్లాలో ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ ఈ నెలాఖరు నాటికి పరిశుభ్రం చేయాలని ఆదేశించిన దృష్ట్యా ఆ మేరకు పరిశుభ్రత కార్యక్రమాల పర్యవేక్షణకై గ్రామంలో సురక్షిత మంచినీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశుభ్రతను పరిశీలిం చడం జరిగిందన్నారు. పరిశుభ్రతపై మండల గ్రామస్థాయి అధికారులకు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పి శ్రీ పల్లవి జలవనుల శాఖ ఏఈ ఎం రహమాన్ గ్రామ సర్పంచ్ పి గణేష్ తదితరులు పాల్గొన్నారు.