రీజనల్ విజిలెన్స్ ఎస్పి పి.వి రవి కుమార్…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మాచవరంలో అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు రీజనల్ విజిలెన్స్ ఎస్పి పి.వి రవికుమార్ సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మండలం మాచవరం గ్రామంలోని ఇంటి నెంబర్ 7-110లో బియ్యం అక్రమంగా నిల్వకు సంబంధించిన విశ్వాసనీయ సమాచారంపై రీజనల్ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆ ఇంటి పై తనిఖీ చేయగా 25 వివిధ బ్యాగులతో సుమారు 13.60 క్వింటాల పిడిఎఫ్ బియ్యం, ఒక తూకం కాటాను పిడిఎస్ (చౌక బియ్యం) మాచవరం గ్రామానికి చెందిన మేడపాటి రామారెడ్డికి చెందినవని, అతను ఒక కిలో పిడిఎఫ్ బియ్యాన్ని రాయవరం పరిసర ప్రాంతాల్లో కార్డుదారుల నుండి కొనుగోలు చేసి మోటార్ సైకిల్ లిస్టు నుండి 17 రూపాయలు కొనుగోలు చేసి తిరిగి అదే బియ్యాన్ని 19 రూపాయలకు అనపర్తి బిక్కవోలు పరిసర ప్రాంతాలలోని ఇటుకుల బట్టి కార్మికులకు విక్రయిస్తున్నారన్నారు. బియ్యం కు సంబంధించిన ఎటువంటి బిల్లులు లేనందున సివిల్ సప్లై అధికారులు సుమారు 59 వేల నాలుగు వందల రూపాయల విలువ గల 13.60 క్వింటాలు పిడిఎస్ బియ్యం, కాటాను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి సిక్స్ ఏ క్రింద కేసు నమోదు చేసి పిడిఎస్ బియ్యాన్ని అక్రమ నిలవ ఉంచిన రామారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రాయవరం పోలీసులకు సిఫార్సు చేయడమైనదని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పిడిఎస్ చౌక బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం మెగా కొనసాగుతుందని, ఎవరైనా పిడిఎఫ్ బియ్యం కొనడం అమ్మడం చేస్తే ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పి రవికుమార్ తెలియజేశారు. ఈ తనిఖీలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, తాసిల్దార్ విజయ్ కుమార్, కానిస్టేబుల్ లోవ కుమార్, కిషోర్ తదితర అధికారులు ఉన్నారు.