విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మహిళ డబ్బును పోగొట్టుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన లిపిన వివరాల ప్రకారం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కాళ్లకూరి అనూషకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా పరిచయమై, జాబ్ ఇప్పిస్తామంటూ మెసేజ్ చేసి, కొన్ని యూట్యూబ్ వీడియోలు పంపించి వాటిని లైక్ చేయమన్నారు. మీరు కొంచెం డబ్బులు పంపిస్తే దానికి అదనంగా డబ్బు పంపిస్తామని చెప్పడంతో, రెండు మూడు సార్లు డబ్బులు వేయించుకుని వెనక్కి తిరిగిచ్చారు. అనంతరం అనుష నుండి సుమారు 800940 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అనంతరం మళ్లీ 43000 నగదు చెల్లిస్తే మొత్తం వెనుకకు ఇస్తామని చెప్పడంతో అనుష మోసపోతున్నట్లు గ్రహించి, బంధువుల సహకారంతో పోలీసులు నాశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.