విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
సర్పంచ్ భర్త, హెల్త్ సూపర్వైజర్ లైంగికంగా పదే, పదే,వేధిస్తున్నారని డి ఆర్ ఓ కి ఫిర్యాదు చేసిన హెల్త్ వర్కర్
లైంగికంగావేధించడమే కాకుండా కులంతో దూషించారంటూ డిఆర్ఓకి తెలిపారు
నిందితులను, వెంటనే అరెస్టు చేయాలని లేదంటే నిరసన ఉధృతం చేస్తామని
ఎమ్మార్పీఎస్ నాయకులు తెలియజేశారు
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పరిధిలోని కె పెదపూడి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పని చేస్తున్న శ్రావణి హెల్త్ వర్కర్ అనే మహిళా ఉద్యోగిని పై ఆ గ్రామ సర్పంచ్ భర్త అయిన బీర రాజారావు మరియ హెల్త్ సూపర్ వైజర్ నెల్లి మధుబాబు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, దీనిపై బాధితురాలు అంబాజీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పరారీలో ఉన్న నిందితులను ఇప్పటి వరకు రాజకీయ పలుకుబడితో అరెస్టు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది, దీనిపై మంగళవారం తన సామాజిక వర్గం అయిన ఎమ్మార్పీఎస్ నాయకులు తో కలసి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు కు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఎం సి హెచ్ పి గా పని చేస్తున్నానని నన్ను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడని సర్పంచ్ భర్త రాజారావు మరియు హెల్ప్ సూపర్వైజర్ మధుబాబు వేధించడమే కాకుండా ఎవరితోనైనా చెప్పినట్లయితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేశారని , దీనిపై నాకు సరైన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా రెవెన్యూ అధికారి కు ఫిర్యాదుతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగిందని, సంబంధిత అధికారులు స్పందించి నాకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాయకులు మోకాటి నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈతకోట రాజు, మాదిగల ఉద్యోగ సంఘ ల అధ్యక్షులు తాతపూడి వెంకటేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు పెదపూడి, మట్ట నాగేశ్వరరావు, ముమ్మిడివరపు వెంకటేశ్వరరావు, సవరపు స్వర్ణ శ్రీదేవి, సవరపు చంటిబాబు, తత్తర మోడీ మహాలక్ష్మి, విష్ణు నేదునూరి ప్రసాద్, నేదునూరి పెద్దిరాజు, మందా రాజేష్ ,మంద ఉమా, పలువురు మాదిగ నాయకులు పాల్గొన్నారు