విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని
డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ పేర్కొన్నారు.
మంగళవారం రాయవరం ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాన్ని డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 211 కోట్లు ఖర్చు చేయగా వేతనాల క్రింద 126.86కోట్లు ఖర్చు చేయగా,84 కోట్లు మెటీరియల్ కాంపిన్షియేషన్ గా ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక లక్షా 58 వేల జాబు కార్డులు ఉండగా, వేతన దారుల సంఖ్య 2లక్షల 26 వేలు ఉందన్నారు. ప్రస్తుతం 2000 పని దినాలకు గాను 17 వేల210 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించే క్రమంలో ప్రస్తుతం 1915 కుటుంబాలకు పని కల్పిస్తున్నామన్నారు. కూలీలకు గరిష్టంగా 257 రూపాయల వేతనం చెల్లించడం నిర్దేశం కాగా, 244 రూపాయలు వేతనం చెల్లిస్తూ మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రధాన మంత్రి ప్రారంభించిన అమృత సరోవర పథకం కింద జిల్లాలో 75 చెరువులు సుందర అమృత సరోవర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికి 19 చెరువులను సుందరీకరించామన్నారు. ఈ చెరువు సుందరీకరణకు కమిషనర్ గరిష్టంగా 2 లక్షల రూపాయలు చెల్లిస్తారన్నారు. ఉపాధి కూలీలకు నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టం ద్వారా అటెండెన్స్ వేస్తున్నామని, దీని ద్వారా అవినీతిని అరికట్టేందుకువీలుంటు
దన్నారు . జిల్లాలో 99 శాతం మంది కూలీలకు జాబ్ కార్డ్, బ్యాంకు అకౌంట్, ఆధార్ నెంబర్లు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. తొలితగా పిడి ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, వేసవిని దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన విధంగా కూలీలకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో జే. సుధారాణి, జెఈ, ఈశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ కరుణాకర్, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.