విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
తోలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డివివి నాగేశ్వరరావు రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.321మంది విద్యార్థులు తెలుగు, సాంస్క్రిట్ పరీక్షలు రాయాల్సి ఉండగా305 మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డివివి నాగేశ్వరరావు రెడ్డి విలేకరులకు తెలిపారు.కాగా 93 మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా 87 మంది పరీక్షకు హాజరై, 6మంది గైరా హాజరయ్యారున్నారు. సాంస్క్రిట్ 228 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 218 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే, 10 మంది గైరహాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.