తాళ్లరేవు మండల అధ్యక్షుడు కే శ్రీను ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కెవిపిఎస్ ఆధ్వర్యంలో సమావేశం
తాళ్లరేవు మండల అధ్యక్షుడు కే శ్రీను ఆధ్వర్యంలో
తాళ్లరేవు మండల కుల వివక్ష పోరాట సంఘం అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో తాళ్లరేవులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు శ్రీను మాట్లాడుతూ తొండంగి మండలం శృంగా వృక్షం గ్రామంలో రాము అనే ఒక దళిత యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన అంతకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా హత్య చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా శ్రీను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట సంఘం నాయకులు అధ్యక్షులు దళిత నాయకులు పాల్గొన్నారు.