టిడిపి నాయకులు కట్టా త్రిమూర్తులు వెల్లడి
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదు
టిడిపి నాయకులు కట్టా త్రిమూర్తులు వెల్లడి
తాళ్ళరేవు మండలం చల్లంగి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టా త్రిమూర్తులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత సాయి కుడిపూడి శివన్నారాయణ లేదని త్రిమూర్తులు విమర్శించారు. శివన్నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం విచారకరమని అతని స్థాయి ఏంటో తెలుసుకోవాలని కట్ట త్రిమూర్తులు హితువు పలికారు. తమ నాయకుడు చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.