రంగనాయక పురం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా వేసిన మొక్కలు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవులో ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఉపాధి మొక్కలు
రంగనాయక పురం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా వేసిన మొక్కలు
తాళ్లరేవు మండల పరిధి రంగనాయక పురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు ఇరువైపుల మొక్కలు ఇప్పుడు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం సిబ్బంది పర్యవేక్షణలో ఈ మొక్కలు పెరిగి పెద్దవి ఎంతో సౌందర్యాన్ని రూపుదిద్దుకున్నాయి. తాళ్ళరేవు గ్రామపంచాయతీ రంగనాయక పురం నుంచి గుత్తుల వారి పాలెం వరకు నాటిన ఈ మొక్కలు రోడ్డుకు ఎంతో అందాన్ని తీసుకొచ్చాయని, గ్రామస్తులు పాదచారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం ప్రతి చోటా చేస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఉంటుందని ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని కొందరు అభిప్రాయపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటి కార్యక్రమం చేపడితే మంచిదని రంగనాయక పురం గ్రామస్తులు తాలరేవు ప్రజానీకం ఆనందం వ్యక్తం చేశారు.