విశ్వంవాయిస్ న్యూస్, ఐ పోలవరం:
*భారత రాజ్యాంగం పై అవగాహన సదస్సు*
ముఖ్య అతిథిగా విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోకా సత్తిబాబు
*విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది
సీనియర్ కాంగ్రీస్ నాయకులు వడ్డీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో
ఐ పోలవరం విశ్వం వాయిస్ న్యూస్
డా.బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం మురమళ్ళలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా విజ్ఞాన దినోత్సవ కార్యక్రమాన్ని విశ్వజన కళామండలి, ఇతర అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సును నిర్వహించారు,ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ ముఖ్య అతిధిగా మోకా సత్తిబాబు విచ్చేశారు.
ఈ సందర్భంగా మోకా సత్తిబాబు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వివరించడం జరిగింది. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో జయంతి వేడుకలు అద్భుతంగా జరిగాయని, అంబేద్కర్ సిద్ధాంతానికి ఈ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ దేశంలో అస్తిత్వం ఉన్నంతవరకు అంబేద్కర్ యొక్క ఆలోచనలు, సిద్దాంతాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు,
విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడటానికి మా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట పటిమను, ఆయన సమాజానికి ఇచ్చిన స్ఫూర్తిని గ్రామ గ్రామాన తెలియపరుస్తామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అయినవిల్లి వలీబాబా,ఎం. ఆశీర్వాదం (బుద్ధిష్ట్), రేవు బాలయోగి రిటైడ్ ఐఅర్ఎస్ ఆఫీసర్, పున్యవంతు రజని, డా. ముని రాజకుమారి, రేవు అప్పలస్వామి, రేవు శ్రీనివాస్, కాశి సత్యనారాయణ, పి. సుధీర్, కుంచే చినబాబు,జూనియర్ అడ్వకేట్ పలివెల నరేశ్ కుమార్ అంబేద్కర్ వాదులు, బుద్దిస్టులు, గ్రామ ప్రజలు, కాశి మూర్తి తదితరులు పాల్గొన్నారు.