విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:
నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన హరీష్ బాలయోగి…
రైతులను ఆదుకోవాలని తహసీల్దారుకి వినతిపత్రం అందజేత….
రైతుల పక్షాన పోరాటానికైనా సిద్దం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాల పరిశీలనలో భాగంగా ఈ పి.గన్నవరంలో పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి పరిశీలించారు.ఈ సందర్భంగా అకాల వర్షంతో రైతులను నిండా మునిగిపోయారని రైతు నష్టపోతే దేశం అభివృద్ధి చెందదని అన్నారు.ప్రభుత్వం రైతులను ఆదుకునేలా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.రైతుల పక్షాన అండగా వుంటామని రైతులకు భరోసా కల్పిస్తామని హరీష్ అన్నారు.అనంతరం పి.గన్నవరం మండల తహసీల్దారుకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టిడిపి నాయకులతో కలసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.