వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాయకులు టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవుమండల కేంద్రంలోని ప్రజాసంఘాల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని వారి డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఉపాధి హామీ కూలీల సమస్యలపై తాళరేవు మండలంలో పర్యటిస్తూ దేశంలో కోట్లాదిమందికి ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుందని, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కార్మిక సంఘం జిల్లా నేత విమర్శించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా తగిన రీతిలో నడిపించి ప్రజలకు 200 రోజులు పని కల్పించి పని యొక్క సొమ్మును కూడా సత్వరమే జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, దుప్పి అదృష్టదీపుడు పాల్గొన్నారు.