ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ని ఖాళీ అయిన వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎంపీపీ రాయుడు సునీత ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నూతనంగా ఎంపిక చేసిన వాలంటీర్లను ఎంపీపీ కార్యాలయంలో వాలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ గాడి మొగ పంచాయతీలో ఒకటి చొల్లంగి గ్రామంలో 1 చొప్పున వాలంటీర్ పోస్ట్లు ఖాళీ అయ్యాయని వాటిని భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రతి వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు సూచించారు.