పంట బోదెలో అనుమానాస్పద మరణాన్ని చేదించిన పోలీస్ లు.
13 రోజుల వ్యవధిలో హత్య కేసును సేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు …
కేసును చేధించడంలో కృషి చేసిన సిబ్బందికి ఎస్పి రివార్డ్..
మీడియా సమావేశంలో కేసు వివరించిన రామచంద్రపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్..
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
గత నెల 20వ, తేదీ రాత్రి వెదురుపాకగ్రామం వద్ద పాల వ్యాపారి కంచి వెంకట రమణ (39)పంట బోదె లో అనుమానాస్పద మరణాన్ని పోలీస్ లు చేదించారు. రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపిన కథనం ప్రకారం రమేష్ అనే క్షుద్ర పూజలు చేసే ఆసామి, మృతిని భార్యను, ఇతర సాక్షులను విచారించగా ఈ హత్యలో ప్రధాన ముద్దాయి ఉప్పాడ కొత్తపల్లి కి చెందిన సామిరెడ్డి సూరిబాబు గా గుర్తించడం జరిగింది అన్నారు. ప్రస్తుతం సామి రెడ్డి సూరిబాబు ఒరిస్సా రాష్ట్రం లో సునాగడ్డ లో నూతులు త్రవ్వే వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు, ఇలావుండగా మృతిని కి చిన్నమ్మ అయిన వెదురుపాక గ్రామానికి చెందిన దుర్గ సామిరెడ్డి సూరిబాబు తో సహజీవనం సాగిస్తుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గకు వెదురుపాక గ్రామంలో ఒక ఇళ్లు వున్నట్లు ఉంది. ఆ ఇంటికీ దుర్గ, ముద్దాయి సూరిబాబు తో కలిసి వచ్చిన ప్రతీసారి ఆ యింటి లోనే ఉంటూ ఉండేవారు. అయితే గత 7సంవత్సరాలు నుండి సామిరెడ్డి సూరిబాబు కి కుటుంబీకులకు అనారోగ్యం సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో వెదురుపాక గ్రామంలో వున్న ఇంటిని అమ్మే బాధ్యతను కంచి వెంకట రమణ కు ముద్దాయి సూరిబాబు అప్పగించాడు. అయితే ఆ ఇంటిని తక్కువ ధరకు దక్కించు కోవాలనే దుర్బుద్ధితో వెంకట రమణ కు కలగడంతో, సామిరెడ్డి సూరి బాబు కుటుంబీకులు రోగాలు భారిన పడినప్పుడే వాళ్లకు క్షుద్ర పూజలు చేసే రమేష్ తో పూజలు చేయిస్తానని పలు దఫాలుగా సొమ్ములు కాజేసాడు అని తెలిపారు. ఆ ఇంటిలో నిమ్మకాయలు, కొబ్బరికాయ లు, ముగ్గులు వగైరా క్షుద్ర పూజలు చేసే ఆనవాల్లు కల్పించి, ఇంటిలో దయ్యాలు తిరుగుతున్నాయి ఎవరూ కొనరు అని మృతుడు వెంకట రమణ ముద్దాయి సూరిబాబు ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం నమ్మని ముద్దాయి సూరి బాబు ఇతను ను భౌతికంగా తొలగిస్తేనే తన ఇంటిని అమ్ముకోవచ్చు అని నిర్ణయానికి వచ్చాడు అన్నారు. తన స్వగ్రామం లో వున్న సహచరులకు వెంకట రమణ చేస్తున్న మోసం గూర్చి వివరించి వారితో వెంకటరమణ ను అంతమొందించేందుకు పథకం వేసాడు. ఈ నేపద్యంలో గత నెల 20 వతేదీ రాత్రి అతడు తన సహచరులతో కలసి పాలకేంద్రం దగ్గర ఉన్న వెంకటరమణను జగనన్న ఇండ్ల స్థలాలు వద్దకు తీసుకొని వెళ్ళి ముద్దాయిలు వెంకట రమణను హతమార్చినట్లు తెలిపారు. మృతుడిని ఎవరు చంపారో మొదట తెలియలేదు. గత నెల 21భార్య విజయలక్ష్మి తన భర్త మరణంపై పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు పై పోలీసులు దర్యాప్తు నిర్వహించి సామిరెడ్డి సూరిబాబు, గెడ్డం ఏసుబాబు, పురికుర్తి తపులయ్య లు పథకం ప్రకారం వెంకటరమణ ను అంతమొందించినట్లు దర్యాప్తు లో నిందుతులు నేరం అంగీకరించనట్లు డిఎస్పి తెలిపారు. ముద్దయలను శనివారం అనపర్తి కోర్టు లో హాజరుపర్చనున్నట్లు డిఎస్పి ప్రసాద్ తెలిపారు. దర్యాప్తు లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వెదురుపాక గ్రామం వద్ద ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన 1. స్వామిరెడ్డి సూరిబాబు, 2. గెడ్డం ఏసుబాబు, 3. పురికుర్తి తలపులయ్య అనువార్లను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిల్ లు, 4 సెల్ ఫోన్లు, ఒక పాల క్యాన్, టవల్ లను స్వాధీన పరచు కున్నట్లుగా ఈ కేసును ఛేదించిన విధానాన్ని తెలియజేశారు. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన మండపేట రూరల్ సిఐ కొమ్ము శ్రీదర్ కుమార్, రాయవరం ఎస్సై జి.నరేష్ లను ఆయన అభినందించి,వారికి కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ వారికి తగు విధంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై పి. వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.