విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
విశ్వం వాయిస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం
ద్రాక్షారామ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళ్ళోద్దరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు. పూలే 133 వ వర్ధంతి సందర్భంగా ద్రాక్షారామ మసీదు సెంటర్ లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలుకు మైనార్టీ బీసీ నాయకులు కానీల వీరభద్రరావు,కణితి రాంబాబు,వేమవరపు రాంబాబు,కొత్తపల్లి దుర్గా ప్రసాద్,గోళ్ళ మంగపతి రాజు,దాలిపర్తి బీమేశ్వరరావు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా యాట్ల మాట్లాడుతూ 1873 సెప్టెంబర్ 24 న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్య శోధక్ సమాజ్ స్థాపించారని తెలిపారు.నూతన పార్లమెంటు ఆవరణ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి,రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలి, పూలే జయంతి రోజున ప్రభుత్వం శెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గారోజు సూరిబాబు,ఎర్రం శెట్టి రామరాజు,కొండా రాజు,వై.సుమంత్ కుమార్, కే.గంగాధర్,టీ. బాలు,తదితరులు పాల్గొన్నారు