213 వ రోజు యువగలం పాదయాత్రలో పాల్గొన్న పోలేకుర్రు, పి మల్లవరం, తోటపేట తెలుగుదేశం నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెం పి మల్లవరం గ్రామాల మీదుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తలపెట్టిన యువగలం పాదయాత్ర 213 వ రోజున తాళ్లరేవు మండలం సంకరపాలెం క్యాంప్ సైట్ నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో అన్ని ప్రాంతాల నుండి కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలివచ్చారు. గోవలంక ఇంజరం గ్రామ దళిత నాయకులు మరియు ఇసుక కార్మికులు లోకేష్ కు ఇసుక కొరతను వివరిస్తూ ఇసుక మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బాధలను వివరిస్తూ నారా లోకేష్ కు ఇసుక గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం బాపనపల్లి, లచ్చి పాలెం గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, పి మల్లవరం సెంటర్లో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, పి మల్లవరం సెంటర్లో నారా లోకేష్ మాట్లాడుతూ మంచి నాయకులను ఎన్నుకోవడం మనందరి బాధ్యత అని, దోపిడీ చేసే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోరంగి శెట్టిబలిజ సామాజిక వర్గ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఒక రూపాయి ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు వెంటనే తరిమికొట్టే విధంగా సిద్ధంగా ఉండాలని, పాదయాత్రలో ఎక్కడ చూసినా ప్రజలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నారని నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ వెంట పాదయాత్రలో అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గంటి హరీష్ మాధుర్, ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్చార్జ్ దాట్ల సుబ్బరాజు, పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలం నుంచి నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, ధూళిపూడి వెంకటరమణ (బాబి), ధూళిపూడి సుబ్బారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పి మల్లవరం, పోలీసులు, జై భీమ్ పేట ,తోటపేట గ్రామాల నుంచి, జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ, వూడా వెంకట రామకృష్ణ, మహేంద్ర బాబు, ఈశ్వరరావు, గోవరాజు, నిమ్మకాయల మూర్తి, వంశి, సురేష్, ఆదినారాయణ, లక్ష్మణరావు, ఇతర నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కలిశారు.