విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష జెఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో మోడరన్ జి.ఆర్.సి జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేసారు. ఈసందర్బంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు మాట్లాడుతూ కె. సుహర్షిత్,కె.శ్రీ గురుదత్త,పి.మేఘన,ఐ.లాస్య,కె.తేజస్విని,పి.లక్ష్మి దుర్గ,ఎన్. ఎం.పి.లహరి,ఎస్.జ్యోతిక, ఎన్.ఎస్.టి.సంతోష్,ఎన్.వి. డి.ప్రియాంక,ఎ.ప్రత్యూష,బి. లక్ష్మి ప్రశాంత్ పర్సెంటైల్ సాధించినట్లు తెలియజేస్తూ,గ్రామీణ ప్రాంతానికి సంబందించిన తమ విద్యార్థులు సాధించిన ఈ విజయం అభినందనీయం అని జెఈఈ మెయిన్స్ సెషన్ 2 కి ఈఫలితాలు పునాదిగా నిలిచి స్ఫూర్తినిస్తాయని ఆకాంక్ష వ్యక్తం చేసారు.అనంతరం మోడరన్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్.సి.హెచ్.రాజేష్ మాట్లాడుతూ నిర్ణీత సంఖ్యలో విద్యార్థులకు జెఈఈ కోచింగ్ ప్రణాళికబద్దంగా అందజేస్తున్నామని పేర్కొంటూ, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.వైస్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ప్రకాష్ మాట్లాడుతూ ప్రత్యేక తరగతులు నిర్వహించడం,నిపుణులైన ప్యాకల్టీతో ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.ఈసందర్బంగా విద్యార్థులకు మోడరన్ స్టాఫ్ అభినందనలు తెలియజేసారు.ఈకార్యక్రమం లో ఇంటర్మీడియట్ అకడమిక్ అడ్వైజర్ సి.హెచ్. శ్రీనివాస్,జె.ఈ.ఈ.టీచింగ్ స్టాఫ్,విద్యార్థులు పాల్గొన్నారు.