WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

స్వతంత్ర సమర యోధుడు ఆజాద్ జయంతి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

స్వతంత్ర సమర యోధుడు ఆజాద్ జయంతి

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం

 

ద్రాక్షారామ :-భారత స్వతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధు అన్నారు.రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో స్థానిక అంబేద్కర్ సమీకృత హాస్టల్లో భారత జాతీయ ఉద్యమ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 118 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హాస్టల్ వార్డెన్ అబ్బిరెడ్డి శ్రీనివాస్,పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దు,అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం రామచంద్రపురం నియోజకవర్గం బీసీ సెల్ కన్వీనర్ కడలి రాంపండు, పిడిఎస్యు నాయకులు కరిపోతుల నవీన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్దు,అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కొదమసింహం ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. ఆయన జన్మించి 118 సంవత్సరాలు అయిందని,అలాగే ఆయన మరణించి 93 సంవత్సరాల అవుతున్న నేటికీ అమరవీరులు ఆశించిన సమాజం రాలేదని,తెల్ల దొరల పోయి,నల్లదొరలు పాలన కొనసాగుతుందన్నారు.ఎంతోమంది దేశభక్తులు మాతృదేశం కోసం తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే, నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశాన్ని,దేశ సంపదలను,సహజ వనరులను స్వదేశీ,విదేశీ, బహుళ జాతి కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు అతి చిన్న వయసులోనే దేశం కోసం కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించారని అటువంటి మహనీయుల అడుగుజాడల్లో యువతీ యువకులు పయనించాలని అన్నారు. నేడు విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని.ఆ సమస్యలపై విద్యార్థులు రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు బి.సంతోష్,ప్రేమ్ కుమార్. బి.జోసెఫ్,కిరణ్ కుమార్, ఎం.ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement