విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్
స్థానిక ఎ.వి. అప్పారావు రోడ్ లో ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో ఆదిత్య డిగ్రీ కళాశాల కు చెందిన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు భక్తులకు తమ సహాయ సహకారాలు అందిస్తూ, వరుసలో భక్తులను పంపిస్తూ, వృద్ధులకు, బాలలకు చేయూతనిస్తూ తమ సేవలను అందించారు. అనంతరావు గారి కోరిక మేరకు ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జి.వి.ఎస్. నాగేశ్వరరావు ఉండగా, మరో పి. ఓ డాక్టర్ బి హెచ్ వి రమాదేవి సహకరించారు. ఆధ్యాత్మిక సేవా స్ఫూర్తితో నున్న కళాశాల ఒక్క ఆదిత్య యే నని, దీనికి ముఖ్య కారకులు డాక్టర్ జి .వి .ఎస్ నాగేశ్వరరావు సేవలు మరువలేమని, ప్రిన్సిపాల్ సిహెచ్ ఫణి కుమార్, ఎస్. కె.ఎన్.రెహమాన్ లు ,పి. ఓ లకు, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.