విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం
విజయవాడ వరద బాధితులకు బాసటగా మోడరన్ సహాయక బృందం
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం :-వరద విపత్తులో చిక్కుకున్న విజయవాడ మహానగరంలోని ప్రజానీకానికి సేవలు అందించే లక్ష్యంతో తమ మోడరన్ కాలేజీ కి సంబందించిన వాలంటీర్లను విజయవాడ పంపించామని,అక్కడ వారు సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు తెలిపారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అక్కల రిశ్వంత్ రాయ్ ఆధ్వర్యంలో తమ టీమ్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పంపినట్లు తెలిపారు.