విశ్వంవాయిస్ న్యూస్, Rajamahendravaram
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయండి : అర్బన్ ఎస్పీ ని కోరిన గొట్టిముక్కల
జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి కోరిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు. అనంతరావు మాట్లాడుతూ పోలీసు స్టేషన్ లలో పెండింగ్ లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరితగితిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేసి, నష్ట పరిహారం అందేలా కృషి చేయాలని కోరారు. స్టేషన్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు అయ్యేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనతికాలంలోనే జిల్లా లో మంచి పేరు సంపాదించుకుని ప్రజల మన్ననలు పొందుతున్నందుకు ఈసందర్బంగా ఎస్పీ ని అనంతరావు అభినందించారు.