మీ సమస్యలను మా దృష్టికి తీసుకురండి బాధ్యత వహిస్తాము
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి సూచన
మాచవరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల.. ఎంపీ హరీష్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల రోజుల పాటు, ప్రజా ప్రతినిధులు అంతా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయ సేకరణ చేసి, స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు, ముఖ్యంగా ఏడాది కాల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని ప్రజానీకానికి వివరించేలా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, మాచవరం గ్రామంలో ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పాల్గొని ఇంటింటికీ వెళ్తూ, ప్రభుత్వ పాలనపై ప్రశ్నలు అడిగి ప్రజలతో సమీక్ష నిర్వహించారు, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కరపత్రికల ద్వారా వివరిస్తూ సందర్శించారు. సంక్షేమ పథకాల అమల విషయంలో కాని, అభివృద్ధి పనుల్లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం చెల్లించామన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశామని, కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సంక్షేమ పథకాలన్నీ ఆమలు పరుస్తామన్నారు, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ముఖ్యంగా రహదారులు ,అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి సాటిలేదని ప్రజలే కితాబు ఇస్తున్నారన్నారు, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు సమపాళ్లలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టిడిపి మాచవరం గ్రామ శాఖ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, నీటి సంఘం ఉపాధ్యక్షులు రిమ్మలపూడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రొంగల శ్రీనివాసరావు,కాదా ఏడుకొండలు, సత్తి బామిరెడ్డి,కొవ్వూరి ఆదిరెడ్డి,తీపర్తి శ్రీ రమేష్, కోడి చిన్న అప్పారావు,గండి చంద్రశేఖర్, నెల్లి రాము, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొవ్వూరి కృష్ణారెడ్డి, గొల్తి ఆంజనేయులు, పొడగట్లపల్లి బ్రహ్మాజీ, కొవ్వూరి సూరెడ్డి, బత్తుల రామకృష్ణ, భోజoకి శివరామకృష్ణ, పులిదిండి లక్ష్మి, పడాల గెడ్డంరెడ్డి,గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అభిమానులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.