Monday, August 4, 2025
Monday, August 4, 2025

అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సుపరిపాలన లో తొలి అడుగు 4.1తొలిరోజు వి.సావరం సందర్శన

వర్షంలోనూ సాగిన ఎమ్మెల్యే వేగుళ్ళ పర్యటన

రాయవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనా భాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజా ప్రతినిధులు, నాయకులు సుపరిపాలన లో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి గడపకు, నెల రోజులపాటు ప్రతి రోజూ నేతలు 30 నుంచి 50 ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించాల్సి ఉందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అదిష్టానం ఆదేశాల మేరకు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు బుధవారం, రాయవరం మండలం, వెదురుపాక సావరం గ్రామంలో గృహాలను సందర్శించగా, వర్షం పడుతున్నా ముందుకు సాగుతూ,కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు,గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఎలా కృషి చేసిందో కరపత్రాల ద్వారా తెలుపుతూ, ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూటమి ప్రభుత్వం ఎలా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందో వివరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉన్నా,సూపర్ సిక్స్ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,అందచేయడంతో పాటు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో మరో హామీ అమలు పరచబోతున్నామని ప్రజలకు తెలిపారు, రైతులకు కేంద్రం ఇచ్చే సహకారంతో,రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు చేయడం, అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, రహదారుల నిర్మాణం,ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు వంటివి కూటమి ప్రభుత్వ విజయాలని కరపత్రాలు పంచుతూ వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు రాయుడు ప్రసాద్, అమలాపురం పార్లమెంటరీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ పిల్లి గణేష్, జనసేన నాయకులు వెలగల వీర్రెడ్డి, బూత్ కన్వీనర్ల్ వాసంశెట్టి లక్ష్మణరావు, వెలగల నాగిరెడ్డి, సింగంపల్లి శ్రీనివాసరావు,ఐటిడిపి గ్రామ అధ్యక్షులు కేతా సతీష్, గ్రామ, మండల అధికారులు, ఎన్డీఏ కూటమి, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo