అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు సుపరిపాలన
ఏడాది సుపరిపాలన కార్యక్రమల
ద్వారానే సాధ్యమని, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేద ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ లు పేర్కొన్నారు. అపార అనుభవశాలి, గొప్ప విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళుతున్నారని, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు, ఒకపక్క ప్రభుత్వ నియామకాలు, మరోపక్క ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి నూతన పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ ఏడాది కాలంలోనే సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు వింటూ వారి అభిప్రాయాలను మై టిడిపి యాప్ లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చావ్వాకుల నారాయణమూర్తి, క్లస్టర్ వనుం వీరబ్రహ్మం, సలాది సాయిబాబు, పలివెల రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు చీకట్ల సూరిబాబు, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గుబ్బల నాగేంద్రకుమార్, వెలుగుబంట్ల శ్రీరామచంద్రమూర్తి, పలువురు కూటమి పార్టీ నాయకులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, బూత్, క్లస్టర్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.