మండపేట మండలం, అర్తమూరు గ్రామంలో ఐటిసి బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.5.00 లక్షల నిధులతో రెండు అంగన్వాడి భవనములను రిపేర్లు చేయుటకు శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పడాల సుబ్బారెడ్డి, పడాల రామకృష్ణారెడ్డి, చిర్ల ఆదిరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి (జంబయ్య), చిర్ల చంద్రారెడ్డి, మేడపాటి వీర్రాఘవరెడ్డి, కాయల సత్తిరాజు, పంచాయితీ సెక్రటరీ అనిల్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు….

