14 October 2025
Tuesday, October 14, 2025

అంగరంగ వైభవంగా కొవ్వూరు ఏఎంసి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి ప్రమాణ స్వీకార మహోత్సవం 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ గా నాదెళ్ల శ్రీరామ్ చౌదరి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం చాగల్లు మండలం చాగల్లు నుంచి పంగిడి దొమ్మేరు మీదుగా బైక్, కార్లు, ట్రాక్టర్ల ర్యాలీతో కొవ్వూరు పట్టణంలోని పరిమి కళ్యాణమండపంలో ఏఎంసీ చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తుందని, పార్టీకి అండగా ఉంటూ కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న వారికి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదని తెలిపారు. యువకులను ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు నిదర్శనమే ఈ ఏఎంసి చైర్మన్ పదవిని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతులను పూర్తిగా విస్మరించాడని, నిరుద్యోగులను దగా చేశాడని అన్నారు. రాబోయే పంచాయితీ మున్సిపాలిటీ జడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ మాట్లాడుతూ కుల మత పార్టీ బేదం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, వ్యవసాయ కమిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మరొక 15 సంవత్సరాలు కూటమీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని, మనమందరం ఐక్యతతో ముందుకు నడవాలని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరాం కు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుతరామయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కొవ్వూరు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పీక్కి నాగేంద్ర, కొవ్వూరు మండలం టిడిపి అధ్యక్షులు వట్టుకుట్టి వెంకటేశ్వర్లు, తాళ్లపూడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, చాగల్లు టిడిపి సీనియర్ నాయకులు హరిబాబు, జనసేన మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు డేగల రాము, బిజెపి మండల అధ్యక్షురాలు డేగల సునీత, టిడిపి నాయకులు సూర్యదేవర రంజిత్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo