- చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిట్టూరి యామిని,లింగం వెంకట కృష్ణ
మండల కేంద్రమైన రాయవరంలో ఇటీవల బాణాసంచా కర్మాగారంలో జరిగిన విస్ఫోటనం లో మృతుల సంఖ్య పదికి చేరింది. సంఘటన లో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి సావరం కి చెందిన చిట్టూరి యామిని, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (చినబాబు) లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాద తీవ్రత తో ఘటనా స్థలంలోనే నిర్వహకునితో కలిపి ఆరుగురు సజీవదహనం కాగా, గాయపడిన నలుగురు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందడం ఆవేదన కలిగించే విషయం.