జిల్లా టైలర్ ఉపాధ్యక్షులు జేజిబాబు…
జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న టైలర్ల సమస్యలు పరిష్కరించాలనీ రాష్ట్ర ట్రైలర్స్ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా టైలర్ సంఘం ఉపాధ్యక్షులు దార్ల జేజి బాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన తాడేపల్లిగూడెం ఆకాశపు స్వామి ను జిల్లా టైలర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దార్ల జేజిబాబు సత్కరించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఎన్నికైన స్వామి జిల్లా టైలర్స్ నాయకులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి దర్జీ లకు ప్రభుత్వ పథకాలు ద్వారా లభించే లబ్ది ప్రతి జిల్లాకు గ్రామాలకు ప్రతి ఒక్కరికి వర్తించలా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. సొసైటీలను ఫెడరేషన్ లో విలీనం చేయడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టిలోకి వెళ్లే విధంగా మాట్లాడి ప్రభుత్వం ద్వారా ఐడెంటి కార్డులు ప్రతి టైలర్ కి సమకూర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చైర్మన్ స్వామి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దర్జీ గర్జన సభ నిర్వహిస్తామన్నారు. పేద టైలర్ల అభివృద్ధికి సొసైటీలు ఫెడరేషన్ లో విలీనం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వానపల్లి ప్రసాద్ రావు, (నారాయణపురం) , నేలటూరి సత్యనారాయణ, (ద్వారకా తిరుమల), ఆలమూరు జక్కం శెట్టి స్వామి , మండపేట దార్ల జేజిబాబు, ఆలమూరు కడలి వెంకటేశ్వరరావు,ఏలూరు దొడ్డి నాగేశ్వరరావు, నారాయణపురం రత్నాజీ,ద్వారకాతిరుమల జంగం లక్ష్మణరావు, గుడివాడ అంజలీదేవి, ద్వారకాతిరుమల దీపాల దుర్గ,ఏలూరు ఖండవల్లి దివ్యవాణి, తాడేపల్లిగూడెం లక్ష్మీ టైలర్స్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం దర్జీ ల సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు

