కొద్దిపాటి నిల్వలైనా ప్రమాదకరంగా మారవచ్చు
బాణాసంచా అక్రమ నిల్వలు గుర్తిస్తే 112 లేదా 100 కు సమాచారం అందించాలి.
రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మీడియా ద్వారా, దీపావళి పండుగ సందర్భంగా, ప్రజల భద్రత దృష్ట్యా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఇళ్ళ వద్ద బాణాసంచా తయారీ లు చేపట్టినా, ఇంట్లో బాణాసంచా నిల్వ చేసినా సమాచారం ఇవ్వాలని , అమ్మకాలు, తయారీకి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తున్నా, అనుమతి లేకుండా నిల్వ చేస్తున్నా 112, 100 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండపేట రూరల్ సిఐ పి దొర రాజు, రాయవరం ఎస్సై డి సురేష్ బాబు లు ఉన్నారు.