రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కాకినాడసిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని చీడీలపొర మరియు పోర్టు పరిసర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను, గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించి రెవెన్యూ మరియు రిజిస్టర్ కార్యాలయాల నందు తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్లు చేయించిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ శాసనసభ్యులు వనమాడి కొండబాబు సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చీడీలపొర మరియు పోర్టు పరిసర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను, గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించి రెవెన్యూ మరియు రిజిస్టర్ కార్యాలయాల నందు తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్లు చేయించారని, మరల అవే దస్తా వేజులను దర్జాగా బయటకి తిప్పుతూ అమాయక ప్రజలకు అంటకట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, చీడీలపొరలో గల సర్వే నెంబరు.112, 182, 199/6/1 లో సుమారు యాభై ఎకరాల భూమిని, కాకినాడ ఆర్డిఓ కేసిన అమ్మిరాజు, గంటి గన్నయ్య, ఎం సత్యనారాయణ మరియు పోలిశెట్టి వెంకట రమణ నిరభ్యంతర పత్రము ఇచ్చినట్లుగా తప్పుడు దస్తావేజులు సృష్టించి, చీడిలపొరలోని ప్రభుత్వానికి చెందిన పోరంబోకు, జిరాయితి భూములను చూపించి, బయటి వ్యక్తులకు అమ్ముతున్నారని, కాకినాడ పోర్టుకి సంబంధించిన ఆర్.ఎస్.నెం.364/2, ఆర్.ఎస్.నెం.2004 సుమారు 79 ఎకరాల భూమికి రెండు పార్టీలకు చెందినదిగా అందులో ఒకరు బెంగుళూర్ కు చెందిన వ్యక్తిదిగా దస్తావేజు సృష్టించారని, మరొకటి కొంతమంది కలిసి వారికీ చెందినదిగా మరొక దస్తావేజు సృష్టించారని ఒక భూమిని విడివిడిగా రెండు దస్తావేజులు సృష్టించినారని, అలాగే కాకినాడ సాంబమూర్తి నగర్ నందు గల కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములను చదును చేసి ప్రైవేటు జరాయితీ భూములుగా సర్వే నెంబర్లు మార్పించి లే-అవుట్లు చేశారని, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారుల అండదండలతో తప్పుడు సర్వే నెంబర్లతో పత్రాలను తారుమారు చేసి వేరు వేరు చోట్ల రిజిస్టర్ ఆఫీసు ల నందు తప్పుడు రిజిస్ట్రీ చేయించడమే కాకుండా వాటిని తొందరగా సామాన్య వ్యక్తులకు అమ్ముటకు ఒక ముఠా ప్రయత్నిస్తుందని, తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్లు చేయించిన వారిపై విచారణ జరిపించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భూములను తగిన చర్యలు తీసుకొని వారు సృష్టించిన తప్పుడు దస్తావేజులను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, వి వై ఏసుదాసు, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, కొల్లా బత్తుల అప్పారావు, పలివెల రవి అనంత కుమార్, ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, చింతలపూడి రవి, పంతాడి రాజు, చింతా పేరాజు, తదితరులు పాల్గొన్నారు.