Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications
Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications

అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్

విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ

అక్రమ సంబంధం వలనేసామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, ట్రైనీ ఆదివారం హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడయిందని నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ వెల్లడించారు. ఈనెల 3వ తేదీన తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్యకు గురైన విషయం తెలిసిందే.మృతురాలు ములపార్తి మాధురి,నిందితుడు తలే సురేష్ మధ్య అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.నిందితుడు మృతురాలి ఆర్ధిక అవసరాలు నిమిత్తం దాదాపు రూ 7లక్షలు వరకూ ఖర్చు చేసినట్లు,నిందితుడి భార్య, మాధురి నుండి వేధింపులు భరించలేక హత్యకు పధకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు.3వ తేదీ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో మాధురి పిలుపు మేరకు వెళ్ళిన నిందితుడు సురేష్ భోజనం చేసి ఆమెతో శారీరకంగా కలిసి ఆమె నుండి ఎదురైన వేధింపులకు కోపోద్రేకుడై వెంట తెచ్చుకున్న దుడ్డుకఱ్ఱతో తలపై గట్టిగా మోది హత్య చేశాడని, ఆమె అరుపులకు నిద్ర లేచిన పిల్లల్ని కూడా అదే కఱ్ఱతో హత్య చేసి ఇంటిలో ఉన్న రూ.2,50,000లు విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడని అన్నారు. కేసు త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు, సామర్లకోట సిఐ ఎ. కృష్ణ భగవాన్, క్రైమ్ సీఐ ఆర్.అంకబాబు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo