కాకినాడ జిల్లాలో గత వారం రోజుల నుండి అల్పపీడనాలు తుఫాను హెచ్చరికల వాతావరణంతో వారం రోజులుగా కొద్దిపాటి వర్షాలు, రాత్రి సమయంలో విపరీతమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారుమడులకు సిద్ధమవుతున్న రైతులు కొందరు విత్తనాలు వెదజల్లే సమయంలో వర్షపాతం వల్ల విత్తనాలు మొలకెత్తడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయన్న ఆలోచనలో రైతులు వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాలాల మార్పులు వాతావరణ ఇబ్బందుల వల్ల ప్రతిసారి రైతులకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు రైతులు మాట్లాడుతూ విపత్తుల సమయంలో రైతులకు వర్షాల వల్ల తుఫాన్ వల్ల నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వం స్పందించి రైతులకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.