డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పురపాలక శాఖలో గురువారం నాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో నకిలీ జనన మరణ ధ్రువీకరణ పత్రాలలో మున్సిపల్ సిబ్బంది అవినీతిపై ప్రశ్న లేవనెత్తిన వైసిపి కౌన్సిలర్ సంసాని చంద్రశేఖర్ (బుల్లి నాని) కౌన్సిలర్ లేవనెత్తిన ప్రశ్న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించిన అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు
ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అమలాపురం పట్టణానికి చెందిన ఓ కుటుంబంలో బర్త్ సర్టిఫికెట్ జారీ చేసిన మున్సిపల్ సిబ్బంది లంచానికి ఆశపడి ఈ రకంగా నకిలీ పత్రాలు ను చాలా మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ కౌన్సిలర్ చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ను స్వీకరించి సర్టిఫికెట్ల నకలను క్రోఢీకరించి అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ ద్వారా విచారణ జరపాలని కోరారు అలాగే సెన్సిటివ్ పోస్టింగుల్లో ఉన్న అధికారులను తక్షణం రొటేషన్ ప్రకారం మారుస్తానని అమలాపురం మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు

