అనధికారక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనుటకు 139 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లే అవుట్ లను క్రమబద్ధీకరించుకునేందుకు అక్టోబర్ 23వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించిందని, లేఅవుట్ యజమానులు ప్రభుత్వం కల్పించిన ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లేఔట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, దళారీల ద్వారా ఎల్టిపివోలు చేయించుకొని మోసపోవద్దని అన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ ద్వారా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, మైక్ ప్రచారాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిపిఓల ద్వారా లేఔట్లను క్రమబద్ధీకరించుకుని రసీదులను పొందవలెనని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గ్రంథి సందీప్ కుమార్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.