14 October 2025
Tuesday, October 14, 2025

అన్నా క్యాంటీన్ లో పేదలకు ఉచిత అన్నదానం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

గండేపల్లి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు సోమవారం గండేపల్లి క్లస్టర్ ఇంచార్జ్, మురారి గ్రామ ఉపసర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ గండేపల్లి క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్ ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వఅన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, టిడిపి యువ నాయకులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు,జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, లారీ యూనియన్ అధ్యక్షులు మారిశెట్టి రాధా, రాష్ట్ర డైరెక్టర్ గెద్దాడ సత్యవేణి, చిరంజీవి, రాయి సాయి, ఎస్ చంద్రశేఖర్, యల్లమిల్లి సీఎం, అల్లు అంజిబాబు, నలామాటి ఆనంద్, దుర్గపు ప్రకాష్, డేగల సత్తిబాబు, నకిరెడ్డి సూర్యవతి, కొత్త ప్రసాద్, అన్నకాంటీన్ ఇంచార్జి ఎండి కాజా, చెలికాని హరిగోపాల్, వానశెట్టి శ్రీను, పోలినాటి ఏ జ్రా శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo